మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో (తుది) టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
"ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు." అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు అంచనాలను అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులోనైనా సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విరాట్ చివరిసారిగా 2019లో శతకం చేశాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన.. చివరి మ్యాచ్‌ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని యత్నిస్తోంది.
రోహిత్ పోస్ట్..
నాలుగో టెస్టులో మొతేరా పిచ్ ఎలా ఉండబోతుందోనని రోహిత్ శర్మ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకున్నాడు. మూడో టెస్టుకు ముందు వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందంటూ జోస్యం చెప్పిన హిట్‌మ్యాన్ తాజాగా ఇలా పోస్ట్ పెట్టాడు.
ఇదీ చదవండి:స్పెయిన్ బయలుదేరిన భారత బాక్సర్ల బృందం