బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ రోజు జరుగుతోన్న పింక్ టెస్టు కోసం స్వయంగా మోదీ స్టేడియంకు వెళ్లలేకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు.
'భారత్-ఇంగ్లాండ్ పింక్ టెస్టును మిస్ అవుతున్నా' - ahmadabad test
మొతేరా వేదికగా జరుగుతోన్న డే/నైట్ టెస్టుకు తాను హాజరవ్వట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
భారత్-ఇంగ్లాండ్ పింక్ టెస్టును మిస్ అవుతున్నా
"ఈ రోజు మొతేరా స్టేడియాన్ని మిస్ అవుతున్నాను. మైదానం నిర్మాణం వెనుక చాలా కృషి ఉంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఇది జరిగింది. పింక్ టెస్టు మా కల. భారత్‌లో ఇది రెండో గులాబీ మ్యాచ్. గతంలో లాగానే ఈ సారి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని ఆశిస్తున్నా" అని గంగూలీ ట్వీట్ చేశాడు.
ఇదీ చదవండి:అక్షర్ బౌలింగ్‌కు మాస్టర్ బ్లాస్టర్ ఫిదా