ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ప్రీమియర్ లీగ్ జట్టును తలపించేలా ప్రస్తుత టీమ్ కూర్పు ఉందని అభిప్రాయపడ్డాడు.
రెండో టెస్టులో ఓడినప్పటికీ.. ఆటగాళ్ల రొటేషన్ పాలసీ విధానాన్ని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సమర్థించాడు. దీంతో రొటేషన్ పాలసీని, టీమ్ సెలక్షన్‌ను తప్పుపట్టాడు వాన్.
'ఎఫ్ఏ కప్ ప్రాథమిక దశలో ఎంపిక చేసే జట్లు ఎలా ఉంటాయో.. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు కూర్పు అలా ఉంది' అని వాన్ ట్వీట్ చేశాడు.
జోస్ బట్లర్ తొలి టెస్టులో ఆడాడు. రెండో టెస్టుకు దూరమయ్యాడు. అండర్సన్ కూడా అలాగే దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రెండో టెస్టు ఆడాడు. మూడో టెస్టుకు పక్కకు పెట్టారు.
ఇదీ చదవండి:పింక్ టెస్ట్: రోహిత్ అర్ధసెంచరీ.. టీమ్ఇండియా 99/3