తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్​ చేసిన అంపైర్లు​ - భారత్​ వర్సెస్ ఇంగ్లాండ్

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న డే/నైట్​ టెస్టులో పర్యటక జట్టు ఆటగాడు స్టోక్స్​ తప్పిదం చేశాడు. పొరపాటుగా బంతికి లాలాజలం రుద్దాడు. గమనించిన అంపైర్లు బంతిని శానిటైజ్​ చేశారు.

Ind vs Eng, 3rd Test: Umpire sanitises ball after Stokes accidentally applies saliva
బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్​ చేసిన అంపైర్లు​

By

Published : Feb 24, 2021, 9:49 PM IST

అహ్మదాబాద్​ పింక్​ టెస్టులో భాగంగా ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ బంతికి లాలాజలం రుద్దాడు. భారత ఇన్నింగ్స్​లో​ 12వ ఓవర్​ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. గమనించిన ఫీల్డ్​ అంపైర్లు వెంటనే బంతికి శానిటైజ్​ చేశారు. స్టోక్స్​ అనుకోకుండా ఈ తప్పిదం చేయడం వల్ల అంపైర్లు అతడికి ఎటువంటి హెచ్చరిక చేయలేదు.

కరోనా వైరస్​ నేపథ్యంలో మెరుపు కోసం బంతిపై లాలాజలాన్ని రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. అలా వరుసగా రెండు సార్లు చేస్తే హెచ్చరికతో వదిలేయాలని సూచించింది. అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తే బ్యాటింగ్​ జట్టుకు 5 అదనపు పరుగులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే బంతి మెరుపు కోసం లాలాజలానికి బదులుగా చెమటను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:'భారత్​-ఇంగ్లాండ్​ పింక్​ టెస్టును మిస్​ అవుతున్నా'

ABOUT THE AUTHOR

...view details