చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్.. మూడు లేదా మూడున్నర రోజుల్లో ముగుస్తుందని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. చెపాక్ పిచ్‌పై తొలి సెషన్లోనే ఎనిమిదో రోజు మ్యాచ్‌లాగా బంతి గింగిరాలు తిరుగుతోందని ట్విట్టర్లో పేర్కొన్నాడు భజ్జీ.
"రెండో టెస్ట్ మొదటి సెషన్లోనే.. 8వ రోజు లాగా బంతి స్పిన్ అవుతోంది. ఈ మ్యాచ్ నా ఊహ ప్రకారం.. మూడు, మూడున్నర రోజుల్లో ముగుస్తుంది."
- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్
రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. విజయావకాశాలు కూడా ఆతిథ్య జట్టుకే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ఒకవేళ మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే అది అద్భుతమేనని ట్వీట్ చేశాడు.
"ఈ పిచ్‌పై టాస్ ఓడిన ఇంగ్లండ్.. మ్యాచ్ గెలిస్తే అదో గొప్ప విజయం అవుతుంది."
- మైకేల్ వాన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
సిరీస్‌లో తొలి టెస్ట్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోగా.. అదే స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్ట్ వికెట్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. తొలి రోజు నుంచే బంతి తిరుగుతూ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (161) భారీ శతకంతో ఆకట్టుకోగా.. రహానె అర్ధసెంచరీ(67) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో రిషభ్ పంత్( 33), అక్షర్ పటేల్(5) ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మొయిన్ అలీ, జాక్ లీచ్ రెండేసి వికెట్లు సాధించగా.. ఓలీ స్టోన్, కెప్టెన్ రూట్లకు ఒక్కో వికెట్ దక్కింది.
ఇదీ చదవండి:'చెపాక్ పిచ్‌పై 300 కొట్టినా 500 చేసినట్లే'