తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో ఇన్నింగ్స్​: 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ - england second innings

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో తడబడుతోంది. నాలుగో రోజు ఆటలో మూడో సెషన్​లో 30ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు వద్ద ఆడుతోంది. టీమ్​ఇండియా బౌలర్లలో అశ్విన్​(3), నదీమ్​, ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ తీశారు.

england
ఇంగ్లాండ్​

By

Published : Feb 8, 2021, 3:01 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు భారత్​ బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్​లో అదరగొట్టిన ప్రత్యర్థి బ్యాట్స్​మన్​పై విరుచుకుపడుతున్నారు. నాలుగో రోజు ఆట చివరి సెషన్​లో ఇంగ్లాండ్​ 30 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు వద్ద ఆడుతోంది. క్రీజులో డొమినిక్​ బెస్​(4), జాస్​ బట్లర్​ (15) ఉన్నారు. టీమ్​ఇండియా బౌలర్లలో అశ్విన్​(3), నదీమ్​, ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్​ 376 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకముందు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 558 పరుగులు చేయగా.. భారత్​ 337 పరుగులకు ఆలౌట్​ అయింది.

ABOUT THE AUTHOR

...view details