ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో జోరు చూపిస్తోంది టీమ్ఇండియా. వరుసగా రెండు టీ20లు గెలిచి ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నేడు (మంగళవారం) జరిగే మ్యాచ్ గెలిస్తే ఆసీస్ గడ్డపై రెండోసారి క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా ఘనత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీమ్ఇండియా టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలను గుర్తు చేసుకుందాం.
1. ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ (2015-16)
ఈ సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం వహించిన టీమ్ఇండియా ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 199 పరుగులతో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి టీ20 అడిలైడ్
భారత్ 188/3 (కోహ్లీ 90*, రైనా 41)
ఆస్ట్రేలియా 151 ఆలౌట్ (ఫించ్ 44, స్మిత్ 21)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- కోహ్లీ 55 బంతుల్లో 90* పరుగులు
రెండో టీ20 మెల్బోర్న్
భారత్ 184/3 (రోహిత్ 60, కోహ్లీ 59*)
ఆస్ట్రేలియా 157/8 ( ఫించ్ 74, షాన్ మార్ష్ 23)
మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్- కోహ్లీ 33 బంతుల్లో 59 పరుగులు
మూడో టీ20, సిడ్నీ
ఆస్ట్రేలియా 197/5 ( వాట్సన్ 124, హెడ్ 26)
భారత్ 200/3 (రోహిత్ 52, రైనా 49*)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- వాట్సన్ 71 బంతుల్లో 124*
మ్యాన్ ఆఫ్ ద సిరీస్- కోహ్లీ 199 పరుగులు 3 మ్యాచ్‌ల్లో
2. భారత పర్యటనకు శ్రీలంక (2017)
మొదటి టీ20, కటక్
భారత్ 180/3 (రాహుల్ 61, ధోనీ 39)
శ్రీలంక 87 ఆలౌట్ ( తరంగ 23, కుశాల్ పెరీరా 19)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- చాహల్ 23 పరుగులకు 4 వికెట్లు
రెండో టీ20, ఇండోర్
భారత్ 260/5 (రోహిత్ 118, రాహుల్ 89)
శ్రీలంక 172 ఆలౌట్ ( కుశాల్ పెరీరా 77, తరంగ 47)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- రోహిత్ శర్మ 43 బంతుల్లో 118
మూడో టీ20, ముంబయి
శ్రీలంక 135/7 (గుణరత్నే 36, దసున్ శనక 29)
భారత్ 139/5 ( మనీశ్ పాండే 32, శ్రేయస్ అయ్యర్ 30)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఉనద్కత్, 4 ఓవర్లలో 15 పరుగులకు రెండు వికెట్లు
మ్యాన్ ఆఫ్ ద సిరీస్- ఉనద్కత్ మూడు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు
3. భారత పర్యటనకు వెస్టిండీస్ (2018)
మొదటి టీ20, కోల్‌కతా
వెస్టిండీస్ 109/8 ( ఫాబియాన్ అలెన్ 27, కీమో పాల్ 15)
భారత్ 110/5 (కార్తీక్ 31*, కృనాల్ పాండ్యా 21*)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 13 పరుగులకు మూడు వికెట్లు
రెండో టీ20, లఖ్‌నవూ
భారత్ 195/2 ( రోహిత్ 111*, ధావన్ 43)
శ్రీలంక 124/9 ( డారెన్ బ్రావో 23, కీమో పాల్ 20)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- రోహిత్ శర్మ 61 బంతుల్లో 111*
మూడో టీ20, చెన్నై