ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే యువ ఓపెనర్ పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ రెండో వికెట్‌కు 31 పరుగులు చేశారు. భాగస్వామ్యం కుదురుకుంటున్న క్రమంలో మయాంక్ (17)ను ఔట్ చేశాడు కమిన్స్. అనంతరం పుజారా 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ 233/6 - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020
ఆస్టేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లీ 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (74) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత కాసేపటికే రహానే (42) స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. విహారి (16) నిరాశపరిచాడు. మొత్తంగా మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సాహా (9), అశ్విన్ (15) క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, హెజిల్వుడ్, కమిన్స్, లియోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.