బాక్సింగ్‌డే టెస్టులో భారత్ గెలవాలంటే 70 పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 200 పరుగులకు ఆలౌటైంది. 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్(45; 146 బంతుల్లో 5x4) ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కమిన్స్(22; 103 బంతుల్లో 1x4) వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. సోమవారం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి చవిచూసేలా కనిపించింది. అయితే టెయిలెండర్ల పోరాటంతో జట్టు స్కోర్ 200కి చేరింది. చివరి నాలుగు వికెట్లతో ఆ జట్టు 101 పరుగులు చేసింది.
ఆసీస్ 200 ఆలౌట్.. భారత్ లక్ష్యం 70 - భారత్-ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు లైవ్ అప్డేట్స్
టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. భారత్ ముందు 70 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అందుకు ప్రధాన కారణం గ్రీన్, కమిన్స్ బ్యాటింగే. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 156 పరుగుల వద్ద బుమ్రా ఓ చక్కటి బంతితో ఈ జోడీని విడదీశాడు. కమిన్స్.. మయాంక్ చేతికి చిక్కడం వల్ల మంగళవారం ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మరో 21 పరుగుల తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో గ్రీన్ జడేజా చేతికి చిక్కాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 177/8గా నమోదైంది. సిరాజ్ బౌలింగ్‌లోనే లియోన్(3) ఔటయ్యాడు. చివర్లో హెజిల్‌వుడ్(10), స్టార్క్(14) కాసిన్ని పరుగులు చేశారు. భోజన విరామం ముందు చివరి ఓవర్‌లో అశ్విన్ హెజిల్‌వుడ్‌ను బౌల్డ్ చేయడం వల్ల ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జడేజా 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు.