మాథ్యూ వేడ్ (80; 53 బంతుల్లో), మ్యాక్స్‌వెల్ (54; 36 బంతుల్లో) అర్ధశతకాలతో చెలరేగడం వల్ల భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్ ఫించ్‌ను సుందర్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్ (24; 23)తో కలిసి వేడ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్‌ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్ తెరదించాడు.
అదరగొట్టిన వేడ్.. టీమ్ఇండియా లక్ష్యం 187 - ఆస్ట్రేలియా-భారత్ మూడో టీ20 స్కోర్ కార్డ్
టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
![అదరగొట్టిన వేడ్.. టీమ్ఇండియా లక్ష్యం 187 IND vs AUS T20](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9807583-381-9807583-1607420078686.jpg)
ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్ అవకాశమే ఇవ్వలేదు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి వేడ్ దూకుడుగా ఆడాడు. అయితే13వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లో మ్యాక్సీ వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. కానీ అది నోబాల్ కావడం వల్ల భారత్‌కు నిరాశ తప్పలేదు. అనంతరం మ్యాక్స్‌వెల్ టాప్‌గేర్‌లో రెచ్చిపోయాడు. వేడ్‌తో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. శార్దూల్, నటరాజన్ ఆఖరి రెండు ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. ఫలితంగా ఆసీస్ స్కోరు 200 దాటలేదు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేలవంగా ఫీల్డింగ్ చేసింది. సులువైన క్యాచ్‌లు జారవిడిచింది. భారత బౌలర్లలో సుందర్ రెండు, శార్దూల్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.