తొలి టీ20లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గత 19 నెలల కాలంలో ఆడిన తొమ్మిది టీ20ల్లో గెలవడం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ చేజార్చుకోవద్దని, రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
జట్టులో మూడు మార్పులు చేసింది ఆస్ట్రేలియా. ఫించ్ గాయంతో దూరమవగా కెప్టెన్గా వేడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఫించ్, హెజిల్వుడ్, స్టార్క్ స్థానంలో డేనియల్ సామ్స్, స్టోయినిస్, ఆండ్రూ టైని జట్టులోకి తీసుకున్నారు.
అలాగే భారత జట్టు కూడా మూడు మార్పులు చేసింది. గాయపడిన జడేజా స్థానంలో చాహల్ ఆడనుండగా, షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, మనీశ్ పాండే స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు.