టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ వేడ్ 32 బంతుల్లో 58 పరుగులతో దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించాడు. తర్వాత ఇతడు నాటకీయ రీతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ షార్ట్ విఫలమైనా.. స్మిత్ 46 పరుగులతో రాణించాడు. తర్వాత మ్యాక్స్‌వెల్ (22), హెన్రిక్స్ (26), స్టోయినిస్ (16) దూకుడుగా ఆడటం వల్ల ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
మెరిసిన వేడ్, స్మిత్.. భారత్ లక్ష్యం 195 - భారత్-ఆస్ట్రేలియా టీ20 జట్లు
టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వేడ్ (58) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
మెరిసిన వేడ్.. భారత్ లక్ష్యం 195
టీమ్ఇండియా బౌలర్లలో నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Last Updated : Dec 6, 2020, 3:31 PM IST