తెలంగాణ

telangana

ETV Bharat / sports

గబ్బాలో 'యువ'గర్జన- టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ - నాలుగో టెస్టులో భారత్ విజయం

IND vs AUS
ఆసీస్​పై భారత్ ఘనవిజయం

By

Published : Jan 19, 2021, 1:08 PM IST

Updated : Jan 19, 2021, 2:07 PM IST

13:42 January 19

గొప్ప సిరీస్​ విజయాల్లో ఇదొకటి..: సచిన్​

టీమ్​ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. గొప్ప సిరీస్​ విజయాల్లో ఇదొకటిగా అభివర్ణించారు. ప్రతి సెషన్​కు ఒక హీరో పుట్టుకొచ్చాడని అన్నారు. 

నిర్లక్ష్యంగా ఆడకుండా.. చాలా జాగ్రత్తగా మ్యాచ్​ను ముగించారని ఆటగాళ్లను ప్రశంసించారు. 

13:40 January 19

గంగూలీ ప్రశంస..

ఆసీస్​లో చారిత్రక విజయం సాధించిన టీమ్​ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఆస్ట్రేలియా వెళ్లి ఈ తరహాలో టెస్టు సిరీస్‌ గెలవడం గొప్ప విజయమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఈ విజయం విలువ అంకెలకు అందేది కాదన్నారు. భారత జట్టులో ప్రతి సభ్యుడికి గంగూలీ అభినందనలు తెలిపారు. 

13:33 January 19

పంత్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​..

చివరి మ్యాచ్​లో టీమ్​ఇండియాను గెలిపించి.. బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్​ పంత్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ లభించింది. 

బౌలింగ్​లో ఎక్కువ వికెట్లు తీసిన ఆసీస్​ బౌలర్​ ప్యాట్​ కమిన్స్​ ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ లభించింది. 

13:32 January 19

టెస్టు ఛాంపియన్​షిప్​లో అగ్రస్థానానికి..

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ నెగ్గిన టీమ్​ఇండియా.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్​ రెండుకు పడిపోయింది. 

5 సిరీస్‍ల్లో 13 టెస్టులాడి 9 విజయాలు సాధించిన భారత్​కు 430 పాయింట్లు ఉన్నాయి. 420 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది న్యూజిలాండ్​. 

13:28 January 19

రూ. 5 కోట్లు బోనస్​..

చారిత్రక సిరీస్​ విజయంతో టీమ్​ఇండియాకు భారత క్రికెట్​ బోర్డు నజరానా ప్రకటించింది. రూ. 5 కోట్లను టీం బోనస్​గా ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జైషా.  

13:26 January 19

టెస్టు ర్యాంకింగ్స్​లో రెండుకు భారత్​..

ఆస్ట్రేలియాపై చారిత్రక సిరీస్​ను గెలిచిన టీమ్​ఇండియా టెస్టు ర్యాంకింగ్స్​లో రెండుకు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. 

13:21 January 19

ప్రధాని ప్రశంసలు..

టీమిండియా చరిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. చారిత్రక టెస్టు సిరీస్​ గెలిచినందుకు టీమ్​ఇండియాకు అభినందనలు తెలిపారు. 

భారత జట్టు విజయానికి దేశమంతా గర్విస్తుందని అన్నారు. ఆటగాళ్లు తమ అభిరుచి, అద్భుత శక్తిని ప్రదర్శించారని కొనియాడారు. 

12:48 January 19

టీమ్​ఇండియాకు బీసీసీఐ నజరానా ​- రూ. 5 కోట్లు బోనస్​

ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే బ్రిస్బేన్ మైదానంలో ఆసీస్ విజయపరంపరకు బ్రేక్ వేసింది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో టెస్టు ఓటమిని చవిచూసింది కంగారూ జట్టు.

నాలుగో ఇన్నింగ్స్​లో 328 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపనర్ గిల్ (91) అద్భుత ఇన్నింగ్స్​కు తోడు పుజారా (56) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో పంత్ (89) తనదైన శైలి దూకుడు బ్యాటింగ్​తో భారత్​కు మరపురాని విజయాన్ని అందించాడు.

Last Updated : Jan 19, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details