తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠగా సిడ్నీ టెస్టు.. కీలకంగా పంత్, పుజారా భాగస్వామ్యం - భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతోంది. లంచ్ బ్రేక్ సమాయానికి టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విజయం కోసం భారత్‌ ఇంకా 201 పరుగులు చేయాలి.

IND vs AUS:
ఉత్కంఠగా సిడ్నీ టెస్టు.

By

Published : Jan 11, 2021, 7:08 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్‌ఇండియా 206/3తో కొనసాగుతోంది. రిషభ్‌ పంత్‌(73) ధాటిగా ఆడుతుండగా, పుజారా (41) పూర్తి రక్షణాత్మకంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 104 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.

అంతకుముందు టీమ్‌ఇండియా 98/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించగా ఆదిలోనే కెప్టెన్‌ రహానె(4) ఔటయ్యాడు. లియోన్ బౌలింగ్‌లో వేడ్‌ చేతికి చిక్కడం వల్ల భారత్‌ 102 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. విజయం కోసం భారత్‌ ఇంకా 201 పరుగులు చేయాలి.

ABOUT THE AUTHOR

...view details