సిడ్నీ టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 180/4 - భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు లైవ్ అప్డేట్స్
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది టీమ్ఇండియా. ప్రస్తుతం మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
భారత్-ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుదురుగా బ్యాటింగ్ చేస్తోంది టీమ్ఇండియా. ఓవర్నైట్ స్కోర్ 96/2తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 180 పరుగులతో నిలిచింది. పుజారా (42), పంత్ (29) క్రీజులు ఉన్నారు. ఆసీస్ కంటే ఇంకా 158 పరుగులు వెనకబడి ఉంది రహానె సేన.