బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. అలాగే వరుసగా మూడోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమెరుగని ఆసీస్‌ను కంగుతినిపించింది. టెస్టు ఛాంపియన్ షిప్లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
గబ్బాలో అబ్బా అనిపించిన టీమ్ఇండియా
బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. 1988 నుంచి అక్కడ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు కంగారూ జట్టు. అక్కడ ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2021లో కంగారూ జట్టును కంగుతినిపించింది భారత్.
గబ్బాలో అత్యధిక ఛేదన భారత్‌దే
గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉండేది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఈ రికార్డును తిరగరాసింది. గబ్బా మైదానంలో 328 పరగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
టీమ్ఇండియా అత్యధిక ఛేదన
1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన
2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన
2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన*
2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన
2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన
ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..
2008/09 : పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన
1928/29 : మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 332 పరుగుల ఛేదన
2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 329 పరుగుల ఛేదన*
తొలి టెస్టు ఓడాక భారత్ సిరీస్ గెలిచిన సందర్భాలు..