ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడుతున్న భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఇదే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నటరాజన్‌ను ప్రశంసించాడు. అతడు తన బౌలింగ్‌ను బాగా అర్థం చేసుకున్నాడని, భారత లైనప్‌కు కావాల్సింది అదేనని అన్నాడు.
"నటరాజన్ మాకో ఆశాజ్యోతి. పరిమిత ఓవర్ల సిరీసుల్లో ఆడినప్పుడు అతడు ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతను చూపించాడు. ఐపీఎల్లో చూపిన ఆత్మవిశ్వాసాన్నే ఆసీస్ గడ్డపైనా చూపిస్తున్నాడు. తన బౌలింగ్ శైలిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. భారత జట్టుకు కావాల్సింది అదే. ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఆడటం అంత సులువు కాదు. తొలి మ్యాచ్‌లోనే కీలక సమయాల్లో నట్టు, సుందర్.. తమ సామర్థ్యం చూపించారు. జట్టు ఏం కోరుకుంటుందో అదే ఇచ్చారు"
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్ కెప్టెన్
గబ్బాలో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. శార్దూల్, సుందర్, నటరాజన్.. తలో మూడు వికెట్లు తీసి సత్తాచాటరు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 62/2తో నిలిచింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైయన్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు. అయితే అతడి షాట్ ఎంపికపై పలువురు మాజీలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పుడు స్పందించాడు హిట్ మ్యాన్.
"నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. ఏం బాధపడటం లేదు. భారీ షాట్ ఆడి బౌలర్‌పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. అది ముఖ్యం కూడా. పరుగులు రావడం కష్టమైనప్పుడు ఎవరో ఒకరు దూకుడుగా ఆడాలి. నేను అదే చేశాను. ఆ క్రమంలో తప్పులు జరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాను" అని రోహిత్ చెప్పాడు.
ఇదీ చూడండి:రోహిత్ శర్మ ఆ షాట్ ఏంటి?.. గావస్కర్ విమర్శలు