తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బ్రిస్బేన్​లోనే ఆఖరి టెస్టు': క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ - భారత్​ vs ఆస్ట్రేలియా నాలుగో టెస్టు

టీమ్ఇండియాతో జరగనున్న ఆఖరి టెస్టును ప్రణాళిక ప్రకారం బ్రిస్బేన్​లోనే నిర్వహిస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లే స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్​ను బ్రిస్బేన్​లో ఆడేందుకు టీమ్​ఇండియా అంగీకరించిందని సోమవారం వెల్లడించాడు.

IND vs AUS: Brisbane to host fourth Test, confirms Nick Hockley
'బ్రిస్బేన్​లోనే ఆఖరి టెస్టు': క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ

By

Published : Jan 11, 2021, 12:36 PM IST

క్వారంటైన్​ నిబంధనలు పాటించాల్సిన క్రమంలో ఆఖరి టెస్టును బ్రిస్బేన్​లో ఆడమని ఇటీవలే టీమ్ఇండియా.. క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టును అక్కడ నిర్వహించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై సోమవారం స్పందించిన క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ.. చివరి టెస్టును ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. బ్రిస్బేన్​ ప్రయాణించడానికి టీమ్​ఇండియా అంగీకరించిందని తెలిపాడు.

"నాలుగో టెస్టును సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు క్వీన్స్​ల్యాండ్​ ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సిరీస్​లో ఇప్పటి వరకు అన్ని రకాల జాగ్రత్తలతో పాటు బయోబబుల్​ నియమాలను పాటిస్తూ.. ప్రభుత్వానికి, ఆరోగ్య అధికారులకు సహకరిస్తున్నాం. నాలుగో టెస్టును బ్రిస్బేన్​లో నిర్వహించేందుకు సహకరిస్తున్న క్వీన్స్​ల్యాండ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం".

- నిక్​ హాక్లే, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ ​

బ్రిస్బేన్​ వేదికగా జనవరి 15 నుంచి ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​కు 50 శాతం మంది వీక్షకులను అనుమతించాలని క్రికెట్​ ఆస్ట్రేలియా నిర్ణయించింది.

ఇదీ చూడండి:అందుకే ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ కాలేదు!

ABOUT THE AUTHOR

...view details