బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లైయన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(91) ఔటయ్యాడు. దీంతో త్రుటిలో అతడికి సెంచరీ మిస్ అయింది. లైయన్ బౌలింగ్‌లో 48వ ఓవర్ చివరి బంతికి స్లిప్‌లో స్టీవ్‌స్మిత్ చేతికి చిక్కాడు. భారత్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
గిల్ సెంచరీ మిస్.. టీమ్‌ఇండియా 138/2 - గబ్బా టెస్టులో గిల్ సెంచరీ మిస్
గబ్బా టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ గిల్(91) త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో పుజారా(26), రహానే(6) ఉన్నారు.
గిల్
అంతకుముందు పుజారా(26*)తో కలిసి గిల్ రెండో వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు. క్రీజులోకి రహానె రాగా తర్వాతి ఓవర్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా గాయపడ్డాడు. బంతి అతడి వేలికి బలంగా తాకడం వల్ల నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. అనంతరం కోలుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.
51 ఓవర్లకు జట్టు స్కోరు 138/2. క్రీజులో పుజారా(26), రహానె(6) ఉన్నారు.