టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. స్మిత్ (131) సెంచరీకి తోడు లబుషేన్ (91), పకోస్కీ (62) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది.
స్మిత్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 338 ఆలౌట్
టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. స్మిత్ (131) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా
ఓవర్‌నైట్ స్కోర్ 166/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. సెంచరీ దిశగా పయనిస్తున్న లబుషేన్ (91)ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత వేడ్(13)నూ ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. కాసేపటికే గ్రీన్ (0)ను వికెట్ల ముందు దొరికించుకున్నాడు బుమ్రా. ఓవైపు స్మిత్ పోరాడుతున్నా మరో ఎండ్‌లో వరుస వికెట్లను కోల్పోయింది కంగారూ జట్టు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసి ఆలౌటైంది.