తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2021, 1:29 PM IST

ETV Bharat / sports

అశ్విన్ బౌలింగ్​లో 10సార్లు ఔటైన బ్యాట్స్​మన్!

టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ తన కెరీర్​లో​ ఎక్కువ సార్లు ఔట్​ చేసింది ఆసీస్​ బ్యాట్స్​మన్​ వార్నర్​నే. సిడ్నీ టెస్టులో డేవిడ్​ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు అశ్విన్.

IND vs AUS: Ashwin dismisses Warner for 10th time in Tests
ఆ బ్యాట్స్​మన్​.. అశ్విన్​ చేతిలో 10 సార్లు ఔట్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్​ వార్నర్​ను టెస్టుల్లో పదోసారి ఔట్​ చేశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. భారత్​, ఆసీస్​ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. సిడ్నీ టెస్టు మూడో రోజున అశ్విన్​ వేసిన 10వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు వార్నర్. ఫలితంగా అశ్విన్ బౌలింగ్​లో ఎక్కువ సార్లు ఔటైన బ్యాట్స్​మెన్​లలో అగ్రస్థానంలో నిలిచాడు.

టెస్టు ఫార్మాట్​లో ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్లు అలిస్టర్​ కుక్​ను 9సార్లు, బెన్​ స్టోక్స్​ను 7 సార్లు పెవిలియన్​కు పంపాడు అశ్విన్. ఇప్పటివరకు వార్నర్​ను 12సార్లు ఔట్​ చేసిన ఇంగ్లాండ్​ బౌలర్ స్టువర్ట్​ బ్రాడ్ మాత్రమే అశ్విన్ కన్నా ముందున్నాడు.

ఇదీ చూడండి:సిడ్నీ టెస్టు: విఫలమైన భారత్.. ఆధిక్యంలో ఆసీస్

ABOUT THE AUTHOR

...view details