ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 21/1గా నమోదైంది.
సిడ్నీ టెస్టు: ఆగని వర్షం.. ముందే భోజన విరామం - ఇండియా ఆస్ట్రేలియా టెస్టు
సిడ్నీ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో అరగంట ముందుగానే భోజన విరామాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం 21/1ఉంది ఆస్ట్రేలియా.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను పేసర్ మహ్మద్ సిరాజ్ బోల్తాకొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడటం వల్ల వార్నర్ పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం విల్ పకోస్కీ(14)తో కలిసి మార్నస్ లబుషేన్(2) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడం వల్ల ఆటను నిలిపివేశారు. బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్ చేయగా, సిరాజ్ 3.1 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టాడు.