టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలిరోజు ఆధిపత్యం వహించింది ఆస్ట్రేలియా. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే మొదటి రోజు స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత పేసర్ బుమ్రా.. స్మిత్ బాడీ లాంగ్వేజ్‌ను అనుకరిస్తూ కెమెరాలకు చిక్కాడు. ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
ఏం జరిగింది?
స్మిత్‌కు బౌలింగ్ చేశాక రనప్ కోసం వెళుతున్న సమయంలో బుమ్రా అతడిని ఇమిటేట్ చేశాడు. అతడి లాగా భుజాలను విదుల్చుతూ కనిపించాడు. ఇది చూసిన మరో బౌలర్ సిరాజ్ నవ్వాపుకోలేకపోయాడు. వీరిద్దరినీ చూసిన నెటిజన్లు లాఫింగ్ ఎమోజీస్‌తో కామెంట్లు పెడుతున్నారు.
స్మిత్ డిఫరెంట్ మేనరిజం
క్రీజులో స్మిత్‌ది విభిన్నమైన మేనరిజం. స్టంప్స్ దగ్గర మాటిమాటికీ అటూ ఇటూ జరుగుతూ అతడు చేసే సందడి క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. ఇదే విషయమై ఇంతకుముందు మరో పేసర్ ఇషాంత్ శర్మ కూడా స్మిత్ మేనరిజాన్ని ఇమిటేట్ చేశాడు.