ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమవుతోంది భారత జట్టు. ఆడిన రెండు వన్డేల్లోనూ ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పుపైనా పలువురు మాజీలు పెదవి విరుస్తున్నారు. మూడో వన్డేలోనైనా టీమ్ఇండియా మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం.
బ్యాటింగ్‌లో నో ఛేంజెస్!
దాదాపు ఇదే బ్యాటింగ్ లైనప్‌ను తరువాతి మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే బాగుంటుందనేది విశ్లేషకుల మాట. 'ఒకవేళ మయాంక్ అగర్వాల్‌ను తప్పించాలని చూసినా అది ఎందుకూ ఉపయోగపడదు. అందువల్ల అతడికి మరో అవకాశం ఇవ్వడం మంచిదే. అలాగే కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలోనే కొనసాగిస్తే బాగుంటుందనేది' మాజీల అభిప్రాయం.