చెన్నై సూపర్కింగ్స్లో సురేశ్ రైనా లాంటి సత్తా ఉన్న ఆటగాడికి ప్రత్యామ్నాయ ఎంపిక కష్టమని ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ అన్నాడు. టోర్నీ నుంచి రైనా, హర్భజన్ వైదొలగడం జట్టుకు తీరని లోటు అని, వారిద్దరి స్థానాల్లో మురళీ విజయ్, స్పిన్నర్ పియూష్ చావ్లాలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
"చెన్నై సూపర్కింగ్స్లో రైనాకు ప్రత్యామ్నాయం వెతకడం కష్టమే. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతడు రెండోవాడు. టోర్నీలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి క్రికెటర్, టోర్నీ నుంచి తప్పుకోవడం మా జట్టుకు తీరని లోటు. అతడి స్థానంలో మురళీ విజయ్, హర్భజన్ స్థానంలో చావ్లాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. వారిద్దరి అనుభవాన్ని జట్టు కోల్పోయినా.. పరిస్థితులను బట్టి కొత్త వారిని ఉపయోగించుకోవాలి".