ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మొదలుపెట్టాలనుకున్న 'ద హండ్రెడ్'(100 బంతుల) టోర్నీకి ప్రారంభ సీజన్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ జులై 17 నుంచి నిర్వహించాలనుకున్న లీగ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ, బోర్డు నిర్ణయం తీసుకుంది. గురువారం అందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.
100 బంతుల టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా - క్రికెట్‌పై కరోనా ప్రభావం
ఇంగ్లాండ్ బోర్డు నిర్వహించాలనుకున్న 100 బంతుల క్రికెట్ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ద హండ్రెడ్ లీగ్
తొలుత ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని భావించిన ఈసీబీ.. కరోనా ప్రభావం వల్ల ఆ ఆలోచనను మార్చుకుంది. వచ్చే ఏడాది జరపనున్నట్లు తెలిపింది. అయితే ఇరుజట్లకు చెరో వంద బంతులు కేటాయించేలా ఉన్న ఈ టోర్నీపై గతంలో విమర్శలూ వచ్చాయి.