పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ ధావన్.. స్కోరు బోర్డులో 9 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరికాసేపటికే రోహిత్ శర్మ(25 బంతుల్లో 25) రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్(108).. కెప్టెన్ విరాట్ కోహ్లీ(66)కి సహకారమందించాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
కోహ్లీ-రాహుల్ శతక భాగస్వామ్యం రాహుల్-పంత్ సుడిగాలి ఇన్నింగ్స్..
కోహ్లీ నిష్క్రమణ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్.. అప్పటికే ఊపుమీదున్న రాహుల్‌కు జతకలిశాడు. నాలుగో వికెట్‌కు ఈ జంట 77 బంతుల్లోనే 113 పరుగులు జోడించింది. ఈ క్రమంలో కెరీర్లో 5వ వన్డే సెంచరీ చేశాడు రాహుల్. కొద్ది సేపటికే టామ్ కరన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పంత్.. మొత్తంగా 40 బంతుల్లో 77 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(35; 16 బంతుల్లో) కూడా బ్యాట్ ఝుళిపించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
బ్యాట్ ఝుళిపిస్తున్న పంత్ సిక్సర్లతో రెచ్చిపోయిన హార్దిక్ ఇదీ చదవండి:కోహ్లీ మరో ఫీట్.. మూడో స్థానంలో 10వేల పరుగులు