తెలంగాణ

telangana

ETV Bharat / sports

'లాక్​డౌన్​లో విశ్రాంతి లభించినా.. ఆటతీరులో మార్పు వస్తుంది' - Mohammed Shami interview

కరోనా లాక్​డౌన్​ తర్వాత బౌలింగ్​ శిక్షణపై పూర్తి దృష్టి సారించినట్లు స్పష్టం చేశాడు టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమి. ఈ విరామంలో తగినంత విశ్రాంతితో పాటు ఫిట్​నెస్​ కోల్పొయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లాక్​డౌన్​ తర్వాత తన స్వస్థలమైన సహస్పుర్​లో ప్రాక్టీస్​ చేస్తూ.. బౌలింగ్​లో తిరిగి పట్టు సాధించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షమి.

In lockdown, you will gain physically but rhythm will be affected: Mohammed Shami
'లాక్​డౌన్​లో విశ్రాంతి లభించినా.. ఆటతీరులో మార్పు వస్తుంది'

By

Published : Jul 10, 2020, 6:08 AM IST

లాక్​డౌన్​ రెండు వైపుల పదునున్న కత్తిలాగా మారిందని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమి. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం సహా సుదీర్ఘ విరామం వల్ల ఫిట్​నెస్​ గాడి తప్పే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాడు.

నగరాల్లో నివసించే భారత ఆటగాళ్లతో పోలిస్తే తాను కచ్చితంగా ప్రయోజనం పొందాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు షమి. తన స్వస్థలమైన సహస్పుర్​లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాని.. మినీ క్రికెట్​ మైదానంలో నెట్​ ప్రాక్టీస్​ కోసం పూర్తి సౌకర్యంగా ఉందని అన్నాడు షమి.

రెండువైపుల పదునున్న కత్తిలా..

"లాక్​డౌన్​లో రెండు రకాల దారులు ఉన్నాయి. ఏడాదంతా విరామం లేకుండా టీమ్​ఇండియా అనేక సిరీస్​లలో పాల్గొంది. ఆటగాళ్లకు ఇదొక విశ్రాంతి సమయంలా భావించవచ్చు. మరో విధంగా ఆలోచిస్తే ఈ విరామంలో ప్రాక్టీస్​తో శారీరకంగా ఫిట్​ ఉండొచ్చు. కానీ, క్రికెట్​ మ్యాచ్​లు ఆడక పోవడం వల్ల ఆటలో పట్టు తప్పుతుంది. ఇదే అసలైన వ్యత్యాసం. ఈ లాక్​డౌన్​లో లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయ"ని తెలిపాడు మహ్మద్​ షమి. ఒకవేళ బీసీసీఐ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తే ఇన్నిరోజులుగా చేసిన ప్రాక్టీస్​ కలిసి వస్తుందని షమి అభిప్రాయపడ్డాడు. లాక్​డౌన్​లో గాయాల నుంచి కోలుకున్నట్లు.. ప్రస్తుతం తన బౌలింగ్​ తీరు బాగుందని తెలిపాడు.

'లాలాజలం' వాడటం లేదు

లాలాజలం లేకుండా ఎర్రబంతి ఎలా ప్రవర్తిస్తుందో తానింకా అంచనా వేయలేదని తెలిపాడు షమి. తన సోదరుడితో కలిసి నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ ట్రైనింగ్​లో పాత బంతితో బౌలింగ్ ప్రాక్టీస్​ చేశారా? అనే ప్రశ్నకు చేయలేదంటూ సమాధానమిచ్చాడీ పేసర్​. లాక్​డౌన్​ తర్వాత బౌలింగ్​ చేసే తీరులో మార్పు వచ్చిందని అన్నాడు షమి. విరామం తర్వాత మొదటిసారి బౌలింగ్​ చేసే ప్రయత్నంలో బంతికి లాలాజలం పూసే అలవాటుతో చేయి అటుగా సాగిందని.. ఆ తర్వాత నిబంధనలను గుర్తు చేసుకుని బంతికి లాలాజలం లేకుండా ప్రాక్టీస్​ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే అలా బౌలింగ్​ చేసినప్పుడు బంతి స్వింగ్​ అవుతుందా అనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details