త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు దూరం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దీని వల్ల ఆసీస్ జట్టు సులభంగా గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
'కోహ్లీ లేకపోతే ఆస్ట్రేలియా గెలుపు సులభమే' - కోహ్లీ అనుష్క శర్మ
కెప్టెన్ కోహ్లీ లేకపోతే.. భారత్తో జరిగే టెస్టు సిరీస్లో ఆసీస్ సులభంగా గెలుస్తుందని మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ
కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో విరాట్ పితృత్వ సెలవుపై స్వదేశానికి రానున్నాడు. ఆ టెస్టుల్లో అతడిని భర్తీ చేసేందుకు రోహిత్ శర్మను ఎంపిక చేసింది బీసీసీఐ.
ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత బృందం.. సిడ్నీలో 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి.