హెలికాప్టర్ షాట్ అనగానే ధోనీ గుర్తొచ్చినట్లు, చెన్నై సూపర్‌కింగ్స్ అన్నాసరే ఇతడే మదిలోకి వస్తాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి సీఎస్కేకు కెప్టెన్‌గా ఉన్న మహీ.. ఈ పదేళ్లలో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. జట్టును మూడుసార్లు విజేతగా నిలపడం సహా ప్రతిసారీ టాప్-4లో ఒకటిగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తాజాగా ఓ టీవీ షోలో మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్.. ధోనీ, తమ జట్టుకు రానున్న పదేళ్లలో శాశ్వత యజమాని అవుతారని పేర్కొన్నారు.
'ధోనీ.. చెన్నై సూపర్‌కింగ్స్ పర్మినెంట్ బాస్' - ధోనీ కాశీ విశ్వనాథన్
భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పిన చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్.. అతడు రానున్న పదేళ్లలో తమ ఫ్రాంచైజీకి యజమాని అవుతారని తెలిపారు. 'తలా' అని మహీని పిలవడం వెనకున్న కారణాన్ని వెల్లడించారు.
ధోనీ
అయితే ధోనీ.. జట్టులోనే కాకుండా ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రతిభను బయటకు తీస్తారని చెప్పిన విశ్వనాథన్.. అందుకే అతడిని 'తలా' అని పిలుస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి:
- టాప్-6: ధోనీ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు
- టాప్-5: మ్యాచ్ గమనాన్నే మార్చేసిన ధోనీ నిర్ణయాలు
- ధోనీ క్రికెట్ ప్రయాణంలో ఆ సంఖ్యలే కీలకం
- సాండ్ ఆర్ట్‌తో ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- 'తలా' ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ
- ధోనీ అభిమానులకు బ్రావో గిఫ్ట్ వచ్చేసింది!
- అత్యుత్తమ కెప్టెన్- రికార్డుల మహేంద్రుడు ధోనీ
Last Updated : Jul 7, 2020, 6:57 PM IST