బౌలింగ్ వేసే సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్ జట్టులో ఉంటే కెప్టెన్‌కు కీలక సమయాల్లో ఉపయోగపడతారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనప్పుడు తాను బౌలింగ్ కూడా వేసేవాడని తెలిపాడు. టీమ్ఇండియాలోనూ స్పిన్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించానని అన్నాడు. 'ఫ్రంట్ రో' యాప్ ఆవిష్కరణలో భాగంగా రైనా పై వ్యాఖ్యలు చేశాడు.
"బ్యాట్స్‌మన్ బౌలింగ్ చేయడమే కాదు, బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలగాలి. ఇది జట్టుకు చాలా ఉపయోగపడే అంశం. బ్యాట్స్‌మన్ కనీసం 4-5 ఓవర్లు బౌలింగ్ చేస్తే, అది కెప్టెన్‌కు ఒత్తిడి తగ్గిస్తుంది" అని సురేశ్ రైనా చెప్పాడు.