తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియాను చూసి ఆ విషయం నేర్చుకోండి' - పీసీబీ, ఆ దేశ ఆటగాళ్లకు మధ్య సమన్వయం లోపించడం

పాక్ క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లతో వ్యవహరించే తీరు మార్చుకోవాలని అన్నాడు ఆ దేశ ఆటగాడు ఇమాముల్ హక్. బోర్డుకు, క్రికెటర్లకు సరైన సంబంధాలు లేకపోవడం వల్ల సరిగ్గా రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.

Imam ul Haq Wants Pakistan Players To Be Treated Like India Dealt With Rohit Sharma
ఆటగాళ్లతో ప్రోత్సాహించడంలో భారత్​ను చూసి నేర్చుకోండి

By

Published : May 2, 2020, 5:32 AM IST

Updated : May 2, 2020, 7:32 AM IST

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ)పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ క్రికెటర్​ ఇమాముల్ హక్​. ఆటగాళ్లు, బోర్డుకు మధ్య సమన్వయం లోపించిందని, ఫలితంగా జట్టు సభ్యులు నిలకడగా రాణించలేకపోతున్నారని అన్నాడు. దీంతో పాటు ఆటగాళ్లు భయంతో ఆడుతున్నారని చెప్పాడు. తాజాగా జరిగిన ఇన్​స్టా లైవ్​​లో ఈ విషయాలు వెల్లడించాడు.

ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో భారత్​ బోర్డును చూసి నేర్చుకోవాలని ఇమామ్ సూచించాడు. టీమిండియా ఓపెనర్​ రోహిత్​ శర్మతో బోర్డు వ్యవహరించిన తీరును ఉదాహరణగా చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ అతడికి అండగా నిలిచి, మెరుగైన ఆటగాడిగా ఎదిగేందుకు దోహదపడిందని తెలిపాడు. అలానే పీసీబీ.. ఆటగాళ్లతో సమన్వయాన్ని పెంచుకుని, వారిని ప్రోత్సాహించాలని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తమలోని భయాన్ని వీడి మైదానంలో దిగాలని ఇమాముల్ అన్నాడు. అప్పుడే జట్టు మెరుగ్గా నిలకడగా రాణిస్తుందని చెప్పాడు.

మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలలో ఇటీవలే ఉమర్ అక్మల్​పై మూడేళ్ల నిషేధం విధించింది పీసీబీ. ఈ విషయంపై ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : May 2, 2020, 7:32 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details