టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్లు, అనుకరించే వాళ్లు ఇక్కడే కాదు విదేశాల్లోనూ ఎంతో మంది ఉన్నారు. చిన్నపిల్లలను నుంచి వయసుపైబడిన వాళ్ల వరకు విరాట్ బ్యాటింగ్ శైలిని ఇష్టపడేవాళ్లు కోకొల్లలు. ఇప్పుడీ జాబితాలోకి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండి రే చేరింది. చిన్నబ్యాట్తో క్రికెట్ ఆడుతూ 'ఐ యామ్ విరాట్ కోహ్లీ(నేను విరాట్ కోహ్లీని)' అంటూ అతడిని అనుకరిస్తోంది.
విరాట్‌లా అవుతానంటూ ఇండి రే క్రికెట్ ఆడుతోన్న వీడియోను వార్నర్ భార్య కాండిస్ ట్విట్టర్లో పంచుకుంది. ఐపీఎల్, భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించినపుడు వార్నర్‌తో పాటు ఇక్కడ చాలా రోజులు గడిపింది ఇండి.