తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​.. టెస్టుల్లో ఇది సరిపోదు'

గబ్బా టెస్టులో టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్​ శర్మ ఔట్ అయిన విధానం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే రోహిత్ తన సమయం కోసం వేచి చూస్తాడని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. సులువుగా ఔట్​ అవడం మానుకోవాలని హిట్​మ్యాన్​కు సూచించాడు.

im sure rohit would love to have his time over again says ponting
'రోహిత్ తన సమయం కోసం వేచిచూస్తాడు'

By

Published : Jan 16, 2021, 10:34 PM IST

భారత స్టార్​ క్రికెటర్​ రోహిత్​ శర్మకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్​ ఓ సలహా ఇచ్చాడు. అతడు స్థిరమైన బ్యాట్స్​మన్​ అని అనిపించుకోవాలంటే సులువుగా వికెట్ చేజార్చుకోవడం మానుకోవాలని సూచించాడు. అది కూడా మంచి ప్రారంభం లభించినప్పుడు.. ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు.

ఆసీస్​తో తొలి ఇన్నింగ్స్​లో రోహిత్​ ఔట్​ అయిన విధానం పట్ల ఇప్పటికే పలువురు క్రికెట్ మాజీలు విమర్శలు చేశారు. అయితే అది తన సహజశైలి అని రోహిత్ తనను తాను సమర్థించుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించాడు పాంటింగ్.

"అతడు అలానే ఆడతా అని చెప్పడం చాలా సులువు కానీ అంతకన్నా మెరుగ్గా ఆడాలి. నిలకడైన మంచి బ్యాట్స్​మన్ అనింపించుకోవాలంటే ఇష్టం వచ్చినట్లు ఆడకూడదు. ఇలానే గొప్ప ఇన్నింగ్స్ చేజార్చుకోవాల్సి వస్తుంది. రోహిత్​.. 44 పరుగులు చాలా సులువుగా చేశాడు. మంచి షాట్లు కూడా ఆడాడు. కానీ అప్పుడే ఆసీస్​ అతడి చుట్టూ ఉచ్చు బిగించింది. ఆ సమయంలో అతడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ ప్రత్యర్థుల వలలో చిక్కుకున్నాడు. నాకు తెలిసి అతడు తన సమయం కోసం మరోసారి ఎదురుచూస్తాడు."

-రిక్కీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ సారథి

ఆసీస్​తో గబ్బాలో జరుగుతన్న నిర్ణయాత్మక చివరి టెస్టులో ఓపెనర్​గా వచ్చాడు రోహిత్​. లైయన్‌ వేసిన ఓవర్​లోని‌ ఐదో బంతిని అతడు గాల్లోకి షాట్‌ కొట్టాడు. అది కాస్త‌ స్టార్క్‌ చేతికి చిక్కింది. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

ఇదీ చూడండి:ఆ షాట్ ఆడినందుకు బాధ లేదు: రోహిత్

ABOUT THE AUTHOR

...view details