ఛాతినొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరిన కపిల్‌కు యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతంగా చేశారు వైద్యులు.
" నా శ్రేయస్సు కోరిన అభిమానుల ఆదరాభిమానాలకు పేరుపేరునా ధన్యవాదాలు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. రికవరీ అవుతున్నా".