ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత కోచ్ రికీ పాంటింగ్.. దిల్లీ క్యాపిటల్స్‌తో కలిశాడు. 4:20 నిమిషాల పాటు సాగిన స్పీచ్‌తో ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. తాను ఇక్కడ ఉన్నది టైటిల్ సాధించిపెట్టేందుకే అని స్పష్టం చేశాడు. దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆ వీడియో మీరు చూసేయండి.
నేను ఇక్కడున్నది ఐపీఎల్ కప్పు కోసమే: పాంటింగ్ - క్రికెట్ న్యూస్ లేటేస్ట్
ఈసారి ఐపీఎల్ కోసం ప్రాక్టీసు చేస్తున్న దిల్లీ ఆటగాళ్లతో కోచ్ పాంటింగ్ తొలిసారి మాట్లాడాడు. తాను ఇక్కడున్నది కప్పు సాధించేందుకేనని స్పష్టం చేశాడు. అందరూ బాగా కష్టపడాలని చెప్పాడు.
నేను ఇక్కడున్నది ఐపీఎల్ కప్పు కోసమే: పాంటింగ్
గతేడాది అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన దిల్లీ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో పంత్ కెప్టెన్‌గా నియమితుడు కావడం, ఇటీవల కాలంలో అతడు అదిరిపోయే ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 10న తలపడనుంది.