తాను బాగానే ఉన్నానని. అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చెప్పాడువెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. ప్రస్తుతం ముంబయిలో ఉన్న లారా.. ఛాతి నొప్పి కారణంతో మంగళవారం ఆసుపత్రిలో చేరాడు.
"నాకు జరిగిన దానికి అందరూ ఆందోళన చెందారు. ఉదయం జిమ్‌లో కొంత సమయం ఎక్కువ గడపడం వల్ల ఛాతిలో నొప్పి వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే మంచిదని ఆసుపత్రిలో చేరా. నొప్పి తీవ్రంగా ఉంటే కొన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం బాగానే ఉంది. హస్పిటల్ బెడ్‌పైనే ఉండి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఎంజాయ్ చేశా." -బ్రియన్ లారా, విండీస్ మాజీ క్రికెటర్