యాషెస్ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడి స్మిత్ 'కాంకషన్'కు గురై అతడి స్థానంలో లబుషేన్ ఆడాడు. ఐసీసీ కొత్తగా తెచ్చిన ఈ నిబంధనపై స్పందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ విధానం ద్వారా ఆటగాడిని సబ్‌స్టిట్యూట్ చేయడం సరైన నిర్ణయమే అని అభిప్రాయపడ్డాడు.
"ఇది(కాంకషన్) సరైన నిర్ణయమే అని అనుకుంటున్నాను. టెస్టు క్రికెట్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక రోజు ఒకలా ఉంటే.. మరుసటి రోజు పరిస్థితి మారిపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వెరొకరిని ఆడించే (బ్యాటింగ్, బౌలింగ్) ఈ విధానం ఎంతో ఉపయోగకరం" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.
వెస్టిండీస్ - భారత్‌కు మధ్య జరిగిన రెండో టెస్టులోనూ విండీస్ ఆటగాడు జెర్మైన్ బ్లాక్‌వుడ్ కాంకషన్ సబ్స్టీట్యూట్గా మ్యాచ్ ఆడాడు. భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో గాయపడిన డారెన్ బ్రేవో స్థానంలో బ్లాక్‌వుడ్ ఆడాడు.