భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇటీవలే చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. తన భార్య సాక్షి సింగ్ కోసం, భార్యాభర్తల అనుబంధం గురించి సరదాగా చెప్పాడు. ఈ మాటలు అక్కడున్న వారిలో నవ్వులు పూయించాయి.
"పెళ్లికాక ముందు ప్రతి మగాడు సింహంలాంటి వాడే. పెళ్లి ప్రాముఖ్యత 50 ఏళ్లు దాటిన తర్వాత తెలుస్తుంది. నా భార్య ఏం చేయాలనుకుంటే నేను చేయనిస్తాను. ఎందుకంటే తను సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉంటా" -ధోనీ, టీమిండియా క్రికెటర్