తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబ్ల్యూటీసీలో భారత్​ ఫైనల్​ చేరితే ఆసియా కప్​ వాయిదా! - ఆసియా కప్​

ఈ ఏడాది జూన్​లో జరగాల్సిన ఆసియా కప్​ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు భారత్​ చేరే అవకాశాలు మెండుగా ఉండటమే దీనికి కారణమని తెలిపాడు.

If India reach WTC final, Asia Cup 2021 will be postponed
'డబ్ల్యూటీసీ వల్ల ఆసియా కప్​ వాయిదా పడొచ్చు'

By

Published : Feb 28, 2021, 4:28 PM IST

టీమ్​ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్స్​కు చేరితే.. ఈ ఏడాది జూన్​లో జరగాల్సిన ఆసియా కప్​ వాయిదా పడుతుందని పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డాడు.

"ఆసియా కప్​ షెడ్యూల్​ను గత సంవత్సరమే నిర్ణయించినప్పటికీ.. ప్రస్తుతానికి ఆ టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్​లో డబ్ల్యూటీసీ ఫైనల్​ను నిర్వహించాల్సి ఉంది. భారత్​ కనుక ఫైనల్​ చేరితే.. ఆసియా కప్​ జరగకపోవచ్చు. ఈ దఫా టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆ సిరీస్​ను 2023కు వాయిదా వేయడం మంచిది."

-ఎహ్సాన్​ మణి, పీసీబీ ఛైర్మన్.

"ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్స్​కు భారత్ అర్హత సాధించవచ్చు. దీంతో శ్రీలంకలో తలపెట్టిన ఆసియా కప్​ ఆగిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై మాకింకా స్పష్టత లేనప్పటికీ.. టోర్నీ జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు." అని పీసీబీ సీఈఓ వసీం ఖాన్​ తెలిపాడు.

వీసాలపై హామీ ఇవ్వండి..

ఈ ఏడాది చివర్లో భారత్​ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్​కప్​ గురించి కూడా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి స్పందించాడు. తమకు వీసాల మంజూరు విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఐసీసీకి ఒక లేఖ కూడా రాశాడు.

"ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్​లో టీ20 ప్రపంచ కప్​ నిర్వహించనున్నారు. మా అభిమానులు, జర్నలిస్టులు, ఆటగాళ్లకు భారత్​ నుంచి వీసాల మంజూరు విషయంలో మాకొక లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాల్సిందిగా ఐసీసీని కోరుతున్నాం. తదుపరి ఐసీసీతో ఉన్న సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఒకవేళ భారత్​ హామీ ఇవ్వలేకపోతే ప్రపంచకప్​ వేదికను యూఏఈ వంటి మరో దేశానికి మార్చాలి."

-ఎహ్సాన్​ మణి, పీసీబీ ఛైర్మన్.

మార్చి 31లోపు వీసాల విషయంపై తేల్చాల్సి ఉందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:టెస్టు ర్యాంకింగ్స్​: రోహిత్ కెరీర్ బెస్ట్​​, అశ్విన్​@3​

ABOUT THE AUTHOR

...view details