తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా క్రికెట్​ ప్రపంచకప్ షెడ్యూల్​ వచ్చేసింది

2021లో న్యూజిలాండ్​ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్​ జరగనుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​గా ఇంగ్లండ్​ బరిలోకి దిగనుంది.

By

Published : Jun 19, 2019, 9:20 AM IST

మహిళల క్రికెట్​ ప్రపంచకప్​కు అంతా సిద్ధం

ప్రస్తుతం ఇంగ్లండ్​ వేదికగా పురుషుల ప్రపంచకప్​ జరుగుతోంది. అదే విధంగా మహిళల ప్రపంచకప్​ మ్యాచ్​లు జరిగే తేదీలు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). న్యూజిలాండ్​ వేదికగా 2021 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్​లు జరగనున్నాయి.

ఐసీసీ మహిళా ప్రపంచకప్​

న్యూజిలాండ్​ ఆతిథ్యమిస్తున్న నాలుగో అంతర్జాతీయ టోర్నీ ఇది. ఇంతకు ముందు 1992, 2015లలో పురుషుల ప్రపంచకప్​ను, 2000లో మహిళల క్రికెట్ ఈవెంట్​ను నిర్వహించింది.

2017లో సొంతగడ్డపై జరిగిన మహిళల ప్రపంచకప్​లో ఇంగ్లండ్​ విజేతగా నిలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్

ఐసీసీ మహిళా ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టిక ఆధారంగా తొలి నాలుగు స్థానాల్లోని జట్లు నేరుగా ప్రపంచకప్​నకు అర్హత సాధిస్తాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(22), ఇంగ్లండ్(22), టీమిండియా(16), దక్షిణాఫ్రికా(16)టాప్-4లోఉన్నాయి. ఆతిథ్యమిస్తున్నందున న్యూజిలాండ్​కు​ నేరుగా ఆడే అవకాశం దక్కింది. మిగతా 3 జట్లు క్వాలిఫయర్ మ్యాచ్​ల ద్వారా అర్హత సాధిస్తాయి.

ఇది చదవండి: అభిమానానికి వయసుతో పనేంటి! అని నిరూపించిన ఓ మహిళ

ABOUT THE AUTHOR

...view details