తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: టీ20ల్లో భారత్​కు​ మూడోస్థానం - ఉమెన్స్ క్రికెట్​

పొట్టి ఫార్మాట్​ ర్యాంకింగ్స్​లో భారత మహిళల జట్టు మరో అడుగు ముందుకేసింది. తాజా టీ20 ర్యాంకింగ్స్​లో ​మూడో స్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్​లో రెండో స్థానం దక్కించుకుంది.

ICC women's team
ఐసీసీ ర్యాంకిగ్స్

By

Published : Oct 3, 2020, 10:07 AM IST

మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ టాప్‌-3లో చోటు సంపాదించింది. శుక్రవారం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ (269 పాయింట్లు)ను వెనక్కి నెట్టిన భారత్‌ (270) మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మహిళా టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (291), ఇంగ్లాండ్‌ (280) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

టీమ్​ఇండియా

వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ (121), ఇంగ్లాండ్‌ (119) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా (160) నంబర్‌వన్‌ ర్యాంకును దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details