తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా టీ20 ప్రపంచకప్​: టాస్‌ గెలిచిన కివీస్‌.. టీమిండియా బ్యాటింగ్​ - ICC Women's T20 World Cup

ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జంక్షన్ ఓవల్ వేదికగా భారత్‌-న్యూజిలాండ్​ మధ్య పోరు ఆరంభమైంది.ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్​ల్లో గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.

ICC Women's T20 World Cup: New Zealand won toss and elected field first against India in Melbourne
మహిళా టీ20 ప్రపంచకప్​: టాస్‌ గెలిచిన కివీస్‌.. టీమిండియా బ్యాటింగ్​

By

Published : Feb 27, 2020, 9:38 AM IST

Updated : Mar 2, 2020, 5:29 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌లో తలపడనుంది హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు. టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి సోఫీ డివైన్‌.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

తొలి టీ20లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన భారత్‌.. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తుచేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఉమెన్​ టీమిండియా గ్రూప్‌-ఎ నుంచి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోనుంది. అయితే, న్యూజిలాండ్‌తో పోరు అంత ఆషామాషీ కాదు. ఆ జట్టు కూడా భారత్‌లా అన్నిరంగాల్లో బలంగానే కనిపిస్తోంది. బంగ్లా మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.

భారత జట్టు:

స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌

న్యూజిలాండ్‌ జట్టు:

సోఫీ డివైన్‌(కెప్టెన్‌), రేచల్‌ ప్రీస్ట్‌, సుజీ బేట్స్‌, మాడీ గ్రీన్‌, కాటీ మార్టిన్‌, అమేలియా కెర్ర్‌, హయ్‌లీ జెన్‌సెన్‌, అన్నా పీటర్‌సన్‌, లీ కాస్పెరెక్‌, లీ తాహుహు, రోజ్‌మెరీ మెయిర్‌

Last Updated : Mar 2, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details