మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు భారత్తో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్లో.. నామమాత్రపు స్కోరు చేసింది శ్రీలంక. కెప్టెన్ చమర్తి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసింది లంక జట్టు.
చెలరేగిన రాధా...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మహిళా జట్టుకు.. మంచి ఆరంభం లభించలేదు. ఉమేశ(2) త్వరగానే ఔటవ్వగా.. కెప్టెన్ చమర్తి(33), హర్షిత(12) నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించారు. ఈ నేపథ్యంలో కెరీర్లో 500 టీ20 రన్స్ పూర్తిచేసుకుంది చమర్తి. అయితే ఈ జోడీని 7 పరుగుల వ్యవధిలో ఔట్ చేసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశారు భారత బౌలర్లు.
ఆఖర్లో కవిష (25) వేగంగా పరుగులు రాబట్టింది. టీమిండియా బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ ఆడిన రెండో మ్యాచ్లోనూ అదరగొట్టింది. 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసింది. ఇది ఆమె కెరీర్లోనే అత్యుత్తమం కావడం విశేషం. ఈమెకు తోడు రాజేశ్వరి(2/18), దీప్తి, శిఖా, పూనమ్ తలో వికెట్ తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.