తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: ఆరుకు పడిపోయిన మంధాన, మిథాలీ@9 - స్మృతి మందాన వార్తలు

మహిళా వన్డే క్రికెటర్ల​ ర్యాంకింగ్స్​ను.. అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ జాబితాలో రెండు స్థానాలు కోల్పోయి 6వ స్పాట్​కు బ్యాట్స్​ఉమన్​ స్మృతి మంధాన చేరుకోగా.. బౌలింగ్​లో జులన్​ గోస్వామి ఐదులోనే కొనసాగుతుంది.

ICC Women's ODI rankings: Mandhana drops two slots, Mithali retains ninth spot
ఐసీసీ ర్యాంకింగ్స్​: ఆరుకు పడిపోయిన మంధాన, మిథాలీ@9

By

Published : Mar 2, 2021, 3:36 PM IST

మహిళల వన్డే క్రికెట్​ ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. కరోనా సంక్షోభం తర్వాత భారత మహిళల జట్టు ఏ సిరీస్​లో ఆడకపోయినా.. ర్యాంకుల్లో కొనసాగుతుండటం విశేషం. ఓపెనర్​ స్మృతి మంధాన (732 పాయింట్లు) బ్యాట్స్​ఉమన్ల జాబితాలో.. రెండు స్థానాలను కోల్పోయి ఆరుకు చేరుకుంది. బౌలర్ల జాబితాలో జులన్​ గోస్వామి 5లోనే కొనసాగుతుంది.

ఐసీసీ వన్డే మహిళల బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​

బ్యాటింగ్​లో..

కెప్టెన్​ మిథాలీరాజ్​.. 687 పాయింట్లతో బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో 9వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్​ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్​లో సత్తా చాటిన ఇంగ్లాండ్​ ఓపెనర్​ టామీ బ్యూమాంట్.. ఐదు స్థానాలు మెరుగై.. అగ్రస్థానంలో నిలిచింది.

మహిళల బౌలింగ్​ జాబితా

బౌలింగ్​లో..

బౌలర్ల జాబితాలో.. భారత్ స్పిన్నర్​ పూనమ్​ యాదవ్​ (679), శిఖా పాండే (675) వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఆల్​రౌండర్​ దీప్తి శర్మ కూడా బౌలింగ్​ జాబితాలో 10వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల బౌలింగ్​ ర్యాంకుల జాబితాలో 804 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన జెస్​ జోనాస్సెన్​ అగ్రస్థానంలో ఉంది.

మహిళల ఆల్​రౌండర్ల జాబితా

ఆల్​రౌండర్ల జాబితాలో..

ఆల్​రౌండర్ల ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియాకు చెందిన దీప్తి శర్మ.. 359 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఏకైక భారత క్రికెటర్​ దీప్తి కావడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిసా పెర్రీ.. 460 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:'ఎవర్ని ఎలా ఔట్​ చేయాలో అశ్విన్​కు బాగా తెలుసు'

ABOUT THE AUTHOR

...view details