అండర్-19 ప్రపంచకప్లోనిభారత్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ మతీశా పతిరానా గంటకు 175 కి.మీ వేగంతో బంతి వేసి వార్తల్లోకెక్కాడు. టీమిండియా యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ ఈ బంతిని ఎదుర్కొన్నాడు. ఇది వైడ్ అయినా, బంతి పూర్తయ్యాక స్క్రీన్‌పై నమోదైన వేగం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే ఐసీసీ మాత్రం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేసిన బంతిగా ఈ రికార్డును ధ్రువీకరించలేదు. స్పీడ్‌గన్ పొరపాటు వల్లే ఈ విధంగా జరిగి ఉండొచ్చని సమాచారం. ఫలితంగా వేగవంతమైన బంతి రికార్డు పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ (గంటకు 161.3 కిలోమీటర్లు) పేరిటే ఉంది. 2003 ప్రపంచకప్‌లో ఈ వేగాన్ని నమోదు చేశాడు అక్తర్.
ప్రపంచ రికార్డులో 'స్పీడ్ గన్' లెక్క తప్పిందా?
అండర్-19 ప్రపంచకప్‌లోని ప్రదర్శనతో శ్రీలంక బౌలర్ మతీశా పతిరానా వార్తల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతి విసిరిన బౌలర్‌గా అతడి పేరు మార్మోగిపోయింది. అయితే ఇతడు వేసిన ఆ బంతి వేగాన్ని స్పీడ్ గన్ తప్పుగా చూపించిందని తెలుస్తోంది. అందుకే ఐసీసీ.. ఈ రికార్డుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రపంచ రికార్డులో 'స్పీడ్ గన్' లెక్క తప్పిందా..?
జూనియర్ మలింగకు చోటు ఇలా
మతీశా.. గతంలోనూ మలింగ వారసుడిగా వార్తల్లో నిలిచాడు. అచ్చం లంక సీనియర్ పేసర్ లసిత్ మలింగను పోలిన బౌలింగ శైలి మాత్రమే కాదు.. తనలాగే పదునైన యార్కర్లు సంధించగలడు. ఫలితంగానే కళాశాల స్థాయిలో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్రదర్శనతో అప్పట్లో పెద్ద సంచలనంగా మారాడు ఈ 17 ఏళ్ల క్రికెటర్. ఈ ప్రదర్శన తర్వాత అండర్-19 ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
Last Updated : Feb 17, 2020, 8:35 PM IST