2011లో వన్డే ప్రపంచకప్‌ను టీమ్ఇండియా గెలుపొంది పదేళ్లు కావోస్తోంది. ఈ సందర్భంగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ల సిరీస్‌ను క్రికెట్ ప్రేమికుల కోసం #CWC11Rewind పేరిట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్‌మీడియాలో వంద పోస్టుల ద్వారా ఆనాటి ఐకానిక్ మూమెంట్స్‌ను పంచుకోనుంది.
2011 వరల్డ్‌కప్ జ్ఞాపకాలతో ఫ్యాన్స్‌కు ఐసీసీ గిఫ్ట్ - 2011 ప్రపంచకప్‌పై ఐసీసీ సిరీస్
ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా ప్రపంచకప్-2011 గెలుపొంది పదేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆనాటి మ్యాచ్‌ల తాలూకూ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి హైలైట్స్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేయడం సహా భారత మ్యాచ్‌ల హైలైట్స్‌ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో తీసుకురానుంది ఐసీసీ.
2011 ప్రపంచకప్ జ్ఞాపకాలతో ఐసీసీ సిరీస్
టోర్నీలో జరిగిన మ్యాచ్‌ల తేదీల్లోనే వాటికి సంబంధించిన హైలైట్స్‌ను 5 నిమిషాల నిడివితో ఐసీసీ వెబ్సైట్లో ఉంచనుంది. టీమ్ఇండియా ఆడిన మ్యాచ్‌ల హైలైట్స్ అన్నీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా ఫైనల్‌కు చేరింది. ముంబయి వేదికగా శ్రీలంకతో జరిగిన తుదిపోరులో భారత జట్టు జయకేతనం ఎగురవేసి.. రెండోసారి ప్రపంచకప్‌ను సాధించింది.