తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇకపై ఫిక్సింగ్​ ఆటలు సాగవు: ఐసీసీ - ఐసీసీ

క్రికెట్​లో అక్రమాలు, అవినీతిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి. మ్యాచ్​ ఫిక్సింగ్​, స్పాట్​ ఫిక్సింగ్​పై పోరాడేందుకు ఇకపై ఇంటర్​పోల్​ సహకారం తీసుకోనుంది.

ఫిక్సింగ్​పై యుద్ధానికి ఇంటర్​పోల్​తో కలిసిన ఐసీసీ

By

Published : Apr 3, 2019, 8:30 PM IST

క్రికెట్​లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఐసీసీ సరికొత్త ఆలోచన చేసింది. ప్రపంచమంతా నెట్​వర్క్​ ఉన్న ఇంటర్​పోల్​ సహాకారం తీసుకోనుంది. క్రీడాకారుల్ని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెట్టనుంది.

ఫ్రాన్స్​లోని ఇంటర్​పోల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్​ మేనేజర్​ అలెక్స్​ మార్షల్. అనంతరం​ ఈ విషయాన్ని వెల్లడించారు.

'ఐసీసీ, ఇంటర్​ పోల్​ కలిసి అవినీతిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లోని న్యాయ సంబంధమైన వ్యవస్థలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం. అయితే ఇంటర్​ పోల్​తో కలవడం వల్ల 194 దేశాల నెట్​వర్క్​ను అనుసంధానం చేసుకోవచ్చు. ఫలితంగా అవినీతిపరుల గురించి మరింత విస్తృతంగా తెలుసుకోవచ్చు.
-- అలెక్స్​ మార్షల్, ఐసీసీ అవినీతి విభాగం

​ఆటగాళ్లకు అవగాహన ఏర్పరిచి క్రీడలో అవినీతి, అక్రమాలు తరిమికొట్టడమే లక్ష్యమని వెల్లడించారు అలెక్స్​. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే ఆయా దేశాల్లోని ఇంటర్​పోల్​తో ఆ విషయంపై లోతైన దర్యాప్తు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

'ఆటల ద్వారా సత్సంబంధాలు పెరుగుతాయి. కానీ కొంత మంది దురాశతో చేసే పనులతో ఆటపై నిబద్ధతకు భంగం కలిగిస్తున్నారు. అందుకే ఐసీసీతో కలిశాం. ఇది చాలా మంచి నిర్ణయం.
-- గ్రేసియా, ఇంటర్​ పోల్​ అసిస్టెంట్​ డైరెక్టర్​

ABOUT THE AUTHOR

...view details