తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 6:01 AM IST

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై అప్పుడే స్పష్టత!

ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు ఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మను సావ్నే తెలిపాడు. ఈ నెల 23న జరిగే కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించాడు.

ICC To Consult Australian Government Regarding Of Men's T20 World Cup 2020
టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై అప్పుడే స్పష్టత!

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లడనున్నట్టు సోమవారం అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ముఖ్య నిర్వాహక అధ్యక్షుడు మను సావ్నే తెలిపాడు. వారితో చర్చించి టోర్నీ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాడు.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్​ కూడా రద్దవుతుందన్న వాదనలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఏప్రిల్​ 23న నిర్వహించే ముఖ్య కార్యనిర్వాహకుల సమావేశంలో నిర్ణయం వెలువడనుంది.

"ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిపుణులు, ఆస్ట్రేలియా ప్రభుత్వ సలహా మేరకు పురుషుల టీ20 ప్రపంచకప్​ను నిర్వహించాలనుకుంటున్నాం. దీని కోసం మాకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని ఉపయోగించుకుంటాం."

-- మను సావ్నే, ఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాయిదా పడిన క్రీడా టోర్నీలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. దాంతో ఐపీఎల్, సూపర్​ లీగ్​, ఎల్​ ఏ లిగ్​ వంటి అన్ని టోర్నమెంట్​ల పునఃప్రారంభ తేదిల్లో స్పష్టత లేదు.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్​ ఈ ఏడాది జరుగుతుందా?

ABOUT THE AUTHOR

...view details