ఆసీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన డే/నైట్ టెస్టులో 136 పరుగులు కొట్టిన విరాట్... తాజా ర్యాంకింగ్స్‌లో మరింత పైకి ఎగబాకాడు. ఇటీవల ప్రదర్శనతో 22 పాయింట్లు మెరుగుపరచుకొని ప్రస్తుతం 928 పాయింట్లతో ఉన్నాడు.స్మిత్(931 పాయింట్లతో) తొలిస్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య అంతరం మూడు పాయింట్లు మాత్రమే.
ఐసీసీ ర్యాంకింగ్స్: కోహ్లీ పైపైకి... టాప్-10లో మయాంక్ - icc test rankings latest
ఐసీసీ మంగళవారం.. టెస్టు ర్యాంకింగ్స్ జాబితా ప్రకటించింది. ఇందులో కోహ్లీ మరింత మెరుగయ్యాడు. బంగ్లాదేశ్‌పై గులాబి టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా సారథి... టాపర్ స్మిత్‌కు మూడు పాయింట్ల దూరంలో నిలిచాడు. అరంగేట్రంలోనే ద్విశతకంతో ఆకట్టుకున్న మయాంక్.. టాప్-10లో స్థానం సంపాదించుకున్నాడు.
![ఐసీసీ ర్యాంకింగ్స్: కోహ్లీ పైపైకి... టాప్-10లో మయాంక్ icc test ranks 2019: Kohli closes in on top-ranked Smith, Agarwal enters into top-10 for first time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5181576-411-5181576-1574761511702.jpg)
ఐసీసీ ర్యాంకింగ్స్: కోహ్లీ పైపైకి... టాప్-10లో మయాంక్
అగర్వాల్ అదరహో...
మరో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్..ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకం సాధించాడు మయాంక్. ఈ ప్రదర్శనతో ఒక్కసారిగా 700 పాయింట్ల ఎగబాకి టాప్-10లో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మొదటి 10 స్థానాల్లో నలుగురు భారతీయులే ఉండటం విశేషం. చతేశ్వర్ పుజారా(791), అజింక్య రహానే(759) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
Last Updated : Nov 26, 2019, 4:03 PM IST